
కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణ శివారులోని ఎస్సారెస్పీ భూమి కబ్జాకు గురికాగా రెవెన్యూ అధికారులు గురువారం సర్వే చేసి హద్దురాళ్లు పాతారు. సర్వే నంబర్ 531లోని ఎస్సారెస్పీ భూమి పట్టణానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అధికారుల అండదండలతో కబ్జాకు పాల్పడగా పట్టణ ప్రజలు అధికారులకు ఫిర్యాదుచేశారు.
ఈ మేరకు గురువారం అధికారులు మోఖాపై సర్వే చేపట్టి ఆక్రమణలను కూల్చివేసి హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేస్తే ఊరుకునేది లేదని తహశీల్దార్ రాజేశ్ హెచ్చరించారు.