ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సర్వే

ములుగు, వెలుగు : తెలంగాణలో సామాజిక, ఆర్థిక స్థితిగతులపై డిజిటలైజేషన్ ప్రభావం అనే అంశంపై గురువారం ములుగులో హైదరాబాద్ సెంట్రల్​​ యూనివర్సిటీ విద్యార్థులు సర్వే నిర్వహించారు.  డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్​ ప్రొఫెసర్లు డాక్టర్ రావుల కృష్ణ తెలిపారు.

విద్యార్థులు సాక్షి, పోపీదేవి, రాంబాబు, ప్రశాంత్ బృందం సభ్యులు ములుగుతోపాటు సమీప గ్రామాల్లో తిరిగి వ్యాపారులు, రైతులు, యువకులు, మహిళల నుంచి సమాచారం సేకరించారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులపై డిజిటలైజేషన్ ప్రభావం ఏవిధంగా ఉందని ప్రశ్నించారు. దానివల్ల సామాన్యులకు కలిగే లాభ, నష్టాలు, విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేశారు.