ఆదిలాబాద్ జిల్లాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే నివేదిక స్పష్టంగా ఉండాలి : కె.ఇలంబర్తి

ఆదిలాబాద్ జిల్లాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే నివేదిక స్పష్టంగా ఉండాలి : కె.ఇలంబర్తి
  • ప్రత్యేక అధికారి, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కె.ఇలంబర్తి

నస్పూర్, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే నివేదిక స్పష్టంగా రూపొందించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రత్యేక అధికారి, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కె.ఇలంబర్తి సూచించారు. శనివారం నస్పూర్ లోని కలెక్టరేట్​లో కలెక్టర్ కుమార్ దీపక్​తో కలిసి సర్వే నిర్వహణపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బృందాల సభ్యులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక కుటుంబానికి ఒక కార్డు అందజేస్తామని, కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఒక ప్రత్యేక నంబర్‌ కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్నింటికీ ఈ కార్డు అనుసంధానమై ఉంటుందన్నారు.

సందేహాలున్న అంశాలను, ఫీడ్ బ్యాక్ వివరాలు తనకు అందిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి అర్డీఓలు రాములు, హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు బృంద సభ్యులు  పాల్గొన్నారు.