‘భగీరథ’ అమలు తీరుపై సర్వే

‘భగీరథ’ అమలు తీరుపై సర్వే
  • సోమవారం నుంచి స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు చర్యలు చేపట్టిన ఆఫీసర్లు
  • పథకం పనితీరు, అవకతవకలపై ఆరా తీయనున్న సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వివరాలతో పాటు కుటుంబ వివరాలు సేకరించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నిర్మల్/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ పథకంపై అనేక ఆరోపణలు రావడం, ఈ పథకం చాలా గ్రామాల్లో లోపభూయిష్టంగా మారిపోవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ పథకం అమలు తీరుపై వివరాలు తెలుసుకునేందుకు సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.

సోమవారం నుంచి పది రోజులపాటు అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే మొదలు పెట్టనున్నారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో నిర్వహించే సర్వే బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు. ఏపీవోలు, ఏపీఎంలు, టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సీసీలతో పాటు ఇతర శాఖల ఆఫీసర్లను ఈ సర్వేలో భాగస్వాములను చేయనున్నారు. 

ప్రత్యేక యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపకల్పన

సర్వే కోసం ఏర్పాటు చేసిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నాయి. ప్రతిరోజు 20 నుంచి 25 ఇండ్లలో సర్వే చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెడీ చేశారు. సర్వేలో భాగంగా యజమాని పేరు, మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ నల్లా కనెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందా ? నీటి సప్లై సక్రమంగా జరుగుతుందా ? అనే వివరాలను తెలుసుకోనున్నారు.

అలాగే ఇంటి ఫొటోతో పాటు, మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ కింద ఏర్పాటు చేసిన నల్లాను సైతం ఫొటో తీయనున్నారు. అనంతరం లబ్ధిదారుడి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఓటీపీని యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన తర్వాతే వివరాలు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతాయి. ఈ సర్వే ద్వారా పథకం నిర్మాణం, అమలులో లోపాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శక్తి ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అనుసంధానించాలని భావిస్తున్నందున సర్వే అనంతరం రిజర్వాయర్లు, పంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లు, ట్యాంకులు, పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లు, మోటార్ల ఏర్పాటు ఇతర వనరుల కోసం కేంద్రానికి రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపనుంది.

‘భగీరథ’ వివరాలతో పాటు కుటుంబ వివరాలు..

మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ స్కీంలో అక్రమాలు, నల్లా కనెక్షన్లపైనే సర్వే చేయాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. అయితే ఇదే టైంలో కుటుంబాలకు సంబంధించిన మరిన్ని అంశాలను జోడించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రూపొందించిన యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్ని మార్పులు చేశారు. మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వివరాలతో పాటు కుటుంబంలో ఎంత మంది ఉన్నారు ? మహిళలు, పురుషులు ఎంత మంది ? కులం, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి వివరాలను సైతం తెలుసుకునేందుకు ఆఫీసర్లు సిద్ధం అవుతున్నారు.