వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు ఆక్రమణలపై సర్వే

వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు ఆక్రమణలపై సర్వే

వర్ధన్నపేట, వెలుగు: చెరువు శిఖం భూమి ఆక్రమించారంటూ ఈ నెల 10న వరంగల్​ కలెక్టర్​కు అందిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువు శిఖం భూములను శుక్రవారం అధికారులు సర్వే చేశారు. 0.25 టీఎంసీల సామర్థ్యం ఉన్న కోనారెడ్డి చెరువు విస్తీర్ణం 478 ఎకరాల 6 గుంటలు అని వర్ధన్నపేట ఎమ్మార్వో విజయ్ సాగర్ తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా, 235 మీటర్ల పొడవు ఉండాల్సిన చెరువు మత్తడి 50 మీటర్లకు వచ్చిందని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.