INS Sandhayak: భారత నేవీ చేతికి ఐఎన్‌ఎస్​ సంధాయక్​

దేశంలో రూపొందిన అతిపెద్ద సర్వే నౌక ఐఎన్​ఎస్​ సంధాయక్​ భారత నౌకాదళంలో చేరింది. కోల్​కతాలోని గార్డెన్​ రీచ్​ షిప్​బిల్డర్స్​ అండ్​ ఇంజినీర్స్​ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ శ్రేణిలోని నాలుగు సర్వే నౌకల్లో ఇది మొదటిది. దీన్ని 2021, డిసెంబర్​ 5న జలప్రవేశం చేయించారు. అప్పటి నుంచి దీనిపై సముద్ర పరీక్షలు జరిగాయి. 

నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్​ 4న ఈ నౌకను లాంఛనంగా నేవీ చేతికి అప్పగించినట్లు జీఆర్​ఎస్​ఈ తెలిపింది. ఐఎన్​ఎస్​ సంధాయక్​ పొడవు 110 మీటర్లు. ఇది తీర ప్రాంతం, సాగరంలో హైడ్రోగ్రఫిక్​ సర్వేలను నిర్వహించగలదు. నేవిగేషన్​ మార్గాల నిర్ధారణకూ సాయపడుతుంది. రక్షణ అవసరాలకు సముద్ర, భౌగోళిక డేటాను సేకరించగలదు. చిన్నస్థాయి పోరాటాల్లో పాలుపంచుకోగలదు. అవసరమైతే హాస్పిటల్​ నౌకగానూ సేవలు అందిస్తుంది. విపత్తు సమయంలో బాధితులను ఆదుకోవడంలో సాయపడుతుంది.