మసాజ్ పార్లర్లు, స్పా కంపెనీల నుండి ఎగ్జిట్ పోల్స్: ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

మసాజ్ పార్లర్లు, స్పా కంపెనీల నుండి ఎగ్జిట్ పోల్స్: ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఆప్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఎగ్జిట్ పోల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలను మసాజ్, స్పా కంపెనీలతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. మసాజ్ పార్లర్లు, స్పా కంపెనీలు నిర్వహించే ఎగ్జిట్  పోల్స్ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలమని అన్నారు సంజయ్ సింగ్. 

అసలైన ఫలితాలు ఫిబ్రవరి 8న వస్తాయని అంతవరకూ వేచి ఉండాలని అన్నారు.మరోసారి భారీ మెజార్టీతో గెలుపొంది ఆప్ పార్టీ అధికారంలోకి రానుందని అన్నారు సంజయ్ సింగ్. ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని అనుకుంటున్నానని అన్నారు. 

ALSO READ | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం: యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే

విద్య, వైద్యం, విద్యుత్, నీరు వంటి కీలక అంశాల్లో ఆప్ ప్రభుత్వం మెరుగైన సేవలు అందించిందని అన్నారు. వృద్దులకు సంజీవని యోజన, మహిళలకు రూ. 2100 వంటి హామీలు ఆప్ విజయానికి కారణం కానున్నాయని అన్నారు.ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని తాను రుజువు చేస్తానని అన్నారు సంజయ్ సింగ్