Suriya45: కమెడియన్ డైరెక్షన్లో సూర్య45 మూవీ.. యాక్షన్ అడ్వెంచరస్ అఫీషియల్ అనౌన్స్

Suriya45: కమెడియన్ డైరెక్షన్లో సూర్య45 మూవీ.. యాక్షన్ అడ్వెంచరస్ అఫీషియల్ అనౌన్స్

స్టార్ హీరో సూర్య (Surya) నటించిన ‘కంగువ’ చిత్రం నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14న ప్రపంచవ్యాప్తంగా 3,500 థియేటర్లలో రిలీజ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతోంది. మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ఈ మధ్యే షూటింగ్ పూర్తయింది.

ఈ క్రమంలో సూర్య హీరోగా మరో కొత్త సినిమా ప్రకటించాడు సోమవారం (అక్టోబర్ 14న) ప్రకటించారు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 45వ చిత్రం. నయనతారతో ‘అమ్మోరు తల్లి’ చిత్రం తెరకెక్కించిన నటుడు ఆర్జే బాలాజీ (RJ Balaji).. ఈ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకాష్‌‌‌‌‌‌‌‌బాబు, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్రభు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సెకండాఫ్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇకపోతే డైరెక్టర్ ఆర్జే బాలాజీ రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన మల్టీ టాలెంటెడ్‌. యాక్టర్​గా, సింగర్​గా, కమెడియన్, డైరెక్టర్​గా రాణిస్తున్నారు. సూర్య తన 45వ సినిమా పూర్తియిన త‌ర్వాత స్టార్ డైరెక్టర్ వెట్రీ మార‌న్ తో 46వ చిత్రం ఉంటుంది.