వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసిన సూర్య.. ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు.
తొలి టీ20లో 21 పరుగులు.. రెండో టీ20లో ఒకే ఒక్క పరుగు చేసి రనౌట్‌గా వెనుదిరిగిన సూర్య.. మూడో టీ20లో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్ ద్వారా సూర్య.. టీ20లలో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 4 సిక్సులు బాదిన సూర్య.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 సిక్స్‌లు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతుకుముందు రోహిత్ శర్మ పేరిట ఈ రికార్డు ఉండేది. సూర్య దానిని అధిగమించాడు. హిట్ మ్యాన్ 84 ఇన్నింగ్స్‌లలో 100 సిక్సుల మార్కును చేరుకున్నాడు.
Suryakumar Yadav became the fastest Indian batter to smash 100 sixes in T20I cricket.
— Wisden India (@WisdenIndia) August 9, 2023
Another milestone for the no.1 T20I batter in the world ?#SuryakumarYadav #India #Cricket #T20Is #WIvsIND #RohitSharma pic.twitter.com/SgOF73KgNC
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్లు
- 182 సిక్సర్లు - రోహిత్ శర్మ (140 ఇన్నింగ్స్)
- 117 సిక్సర్లు - విరాట్ కోహ్లీ (107 ఇన్నింగ్స్)
- 101* సిక్సర్లు - సూర్యకుమార్ యాదవ్ (49 ఇన్నింగ్స్)
- 99 సిక్సర్లు - కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్)
- 74 సిక్సర్లు - యువరాజ్ సింగ్ (51 ఇన్నింగ్స్)
- 68 సిక్సర్లు - హార్దిక్ పాండ్యా (70 ఇన్నింగ్స్)
- 58 సిక్సర్లు - సురేష్ రైనా (66 ఇన్నింగ్స్)
- 52 సిక్సర్లు - ఎంఎస్ ధోని (85 ఇన్నింగ్స్)
- 50 సిక్సర్లు - శిఖర్ ధావన్ (66 ఇన్నింగ్స్)
Suryakumar Yadav became the second fastest batter to reach 100 sixes in T20Is by innings.
— Cricket.com (@weRcricket) August 9, 2023
The India batter completed 100 sixes in 49 sixes, only behind Evin Lewis of West Indies.#SuryakumarYadav | #TeamIndia | #Cricket | #WIvIND pic.twitter.com/yX3N9eQFfe