ఐపీఎల్ లో మెన్స్ బెంగళూరు జట్టునే అనుకుంటే మహిళలను కూడా దురదృష్టం వెక్కిరిస్తుంది. నిన్న (మార్చి 10) చివరి వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో నిరాశ తప్పలేదు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఆదివారం ఆఖరి బాల్‌కు ఉత్కంఠగా సాగిన పోరులో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క రన్ తేడాతో ఆర్‌సీబీపై గెలిచింది. లీగ్‌లో ఐదో విక్టరీతో మళ్లీ టాప్ ప్లేస్‌కు వచ్చిన ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
ఎలైస్ పెర్రీ (32 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 49), రిచా ఘోశ్ (29 బాల్స్‌లో4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) అద్భుతంగా పోరాడినా.. ఆఖరి బాల్‌కు రిచా రనౌటవడంతో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు.182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 180/7 స్కోరు చేసి కొద్దిలో విజయాన్ని చేర్చుకుంది. జొనాసెన్ వేసిన చివరి ఓవర్లో 17 రన్స్ అవసరం అవగా తొలి, ఐదో బాల్స్ రిచా రెండు సిక్స్‌లు కొట్టింది. లాస్ట్ బాల్‌కు రెండు రన్స్ అవసరం అయ్యాయి. కానీ, ఆ బాల్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడిన రిచా సింగిల్ తీసేలోపే ఫీల్డర్ షెఫాలీ వర్మ ఆమెను రనౌట్ చేయడంతో ఢిల్లీ గెలుపు అందుకుంది.
ఈ మ్యాచ్ ఓటమి బెంగళూరు అభిమానులకే కాదు సగటు క్రికెట్ అభిమాని హృద్యయాన్ని కలిచి వేసింది. ముఖ్యంగా రిచా ఘోష్ ఈ ఓటమి అనంతరం గ్రౌండ్ లోనే కుప్పకూలింది. ఈ ఓటమికి ఆర్సీబీ జట్టుపై నెటిజన్స్ సానూభూతి చూపిస్తున్నారు. తాజాగా టీమిండియా టీ20 స్పెషలిస్ట్ సూర్య కుమార్ యాదవ్ ఆర్సీబీ ఓటమిపై స్పందించాడు. రిచా ఘోష్ అద్భుతంగా పోరాడిందని.. ఆమె ఒక స్టార్ అంటూ ప్రోత్సహించాడు. ఆమెకు అందరూ మద్దతు తెలపాలని కోరాడు.
Also Read :దిగొచ్చిన బీసీసీఐ.. రిషబ్ పంత్ రీఎంట్రీకి లైన్‌క్లియర్
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 181/5 స్కోరు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (36 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 58), ఎలైస్ క్యాప్సీ (32 బాల్స్‌లో 8 ఫోర్లతో 48) దంచికొట్టారు. ఓపెనర్లు మెగ్ లానింగ్ (26 బాల్స్‌లో 5 ఫోర్లతో 29), షెఫాలీ వర్మ (18 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 23) కూడా రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (4/26) నాలుగు వికెట్లు తీసింది.
Suryakumar Yadav's Instagram story for Richa Ghosh. pic.twitter.com/sYf0B9glEq
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2024