
పాత్ర ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాడు సూర్య. అందుకే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, సినిమా చూస్తున్నంతసేపు ఆయన క్యారెక్టర్‌తో ప్రేమలో పడిపోతారు ప్రేక్షకులు. ఇప్పుడు అలాంటి మరో పాత్రలో నటిస్తున్నాడు సూర్య. పేదల భూముల కోసం పోరాడే లాయర్‌గా కనిపించబోతున్నాడు. కె.జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను, టైటిల్‌ను నిన్న సూర్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.
మూవీకి ‘జై భీమ్’ అనే పేరును ఫిక్స్ చేశారు. సూర్య రోల్, లుక్ ఎలా ఉండబోతున్నాయనేది పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. రాజీషా విజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, మణికందన్, జయ ప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సూర్య సొంతంగా నిర్మిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. దీంతో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’, పాండిరాజ్ డైరెక్షన్‌లో ‘ఎదర్కుమ్ తుణీందవన్’ చేస్తున్నాడు సూర్య. మణిరత్నం నిర్మిస్తున్న ‘నవరస’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. ఇది త్వరలోనే స్ట్రీమ్ కానుంది.