Kanguva In Serious Trouble: కంగువ నిర్మాత ఇస్స్యూపై విచారణ రేపే (Nov7).. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా!

Kanguva In Serious Trouble: కంగువ నిర్మాత ఇస్స్యూపై విచారణ రేపే  (Nov7).. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా!

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ (Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌, టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.

కంగువ నవంబ‌ర్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం వరుస ప్ర‌మోష‌న్స్ తో దూసుకెళ్తోంది. ఇంకా రిలీజ్ కు 8 రోజులే ఉండటంతో మేకర్స్ బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ప్రమోషన్స్ చేసారు. సౌత్‌లోనే కాదు.. హిందీలోనూ ఈ సినిమాని సూర్య భుజాలపై వేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నాడు.

Also Read:-పెళ్ళికి రెడీ అంటోన్న స్టార్ హీరోయిన్!

ఈ నేపథ్యంలో మరోసారి సూర్య హైదరాబాద్ రానున్నారు. తాజాగా (నవంబర్ 6న) కంగువ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్."కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం (నవంబర్ 7న) సాయంత్రం 6గంటలకు పార్క్ హయత్ (Park Hyatt) (హైదరాబాద్)లో" జరుగుతున్నట్లు ట్విట్టర్ X ద్వారా వెల్లడించారు.  

అయితే.. ఇటీవలే.. కంగువ సినిమా నిర్మాత కేఈ జ్ఞానవేల్‌‌ తమ వద్ద రూ.99 కోట్లకి పైగా అప్పు తీసుకున్నాడని.. కానీ ఇందులో రూ.45 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. కాగా ఈ కేసుని రేపు (నవంబర్ 7న) విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. ఇక ఈ కోర్టు తీర్పు సినిమాకు సానుకూలమైన పరిష్కారం లభిస్తుందనే యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

అయితే, సినిమా రిలీజ్ కు ముందు నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ కారణంగా వాయిదా పడే సూచనలు ఉన్నాయా? లేక రిలీజ్ అవుతుందా? అనేది సూర్య ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఏమవుతుందో చూడాలి.