అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు..

అయోధ్యలో అద్భుతం జరిగింది.. శ్రీరామ నవమి రోజు.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. గర్భ గుడిలో కొలువైన బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకాయి.. సూర్య తిలకం ఆవిష్కృతం అయ్యింది.. 2024, ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం.. సరిగ్గా 12 గంటల 16 నిమిషాల నుంచి 12 గంటల 21 నిమిషాల మధ్య.. అయోధ్యలో ఈ అద్భుతం జరిగింది.

 

ఈ దృష్యాన్ని చూసిన భక్తులు తరించిపోతున్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణం తర్వాత మొదటి సారి సూర్య తిలకం పై సూర్యకిరణాలు పడటంతో రామభక్తులు  ఎంతో ఆసక్తిగా ఈ ఘట్టాన్ని వీక్షించారు. ఈరోజు శాస్రోక్తంగా రాముని నుదుటిపై తిలకం దిద్దనున్నారు. అయోధ్య ఆలయంలో రామ్ లల్లాకు ఇదే మొదటి రామ నవమి. ఈరోజు సూర్యతిలకంపై సూర్యకిరణాలు పడేటట్లు ఐఐటీ ఇంజనీర్లు అద్దాలు, లెన్స్‌లతో ఆప్టో-మెకానికల్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. నేరుగా గర్భగుడిలోకి సూర్యకిరణాలు ప్రవేశించేటట్లు అద్ధాలతో శాస్త్రవేత్తలు ఓ సిస్టమ్ రూపొందించారు.

Also Read:వైభవంగా భద్రాద్రి రాములోరి కల్యాణం