సూర్య.. మ్యాచ్ను మలుపు తిప్పే ఆటగాడు : రాహుల్ ద్రవిడ్

సూర్య..  మ్యాచ్ను మలుపు తిప్పే ఆటగాడు : రాహుల్ ద్రవిడ్

ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు వన్డే మ్యాచ్‌లలో స్టార్ క్రికెటర్  సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించినట్లుగా కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టులో ఉంటాడని తెలిపాడు.  సూర్యకుమార్ ఇప్పటివరకు వన్డే  ఫార్మాట్‌లో 24.40 సగటుతో 27 మ్యాచ్‌లలో కేవలం 537 పరుగులు మాత్రమే చేశాడు.  

ఇటీవల ముగిసిన  ఆసియా కప్ 2023లో సూపర్ 4 లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 26 పరుగులు చేశాడు సూర్య.  అయితే మొహాలీలో జరగనున్న  మొదటి వన్డే మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ద్రవిడ్ మాట్లాడుతూ  సూర్యకుమార్ యాదవ్‌కు మేనేజ్‌మెంట్ నుండి పూర్తి మద్దతు ఉందని  తెలిపాడు.  వన్డే ఫార్మాట్ లో మ్యాచ్ లను మలుపు తిప్పే సత్తా ఉన్న ప్లేయర్ సూర్య అని చెప్పుకొచ్చాడు.  అశ్విన్ రాకతో టీమ్ బలం మరింత పెరుగుతుందని, అతనొక క్వాలిటీ ప్లేయర్ అని ప్రశంసించాడు.  

ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు రెస్ట్ ఇవ్వడంపై  కూడా ద్రవిడ్ వివరించాడు. అందరితో చర్చించాకే రెస్ట్ ఇచ్చామని తెలిపాడు. వరల్డ్ కప్ ముందు స్టార్ బ్యాటర్‌లను మానసికంగా, శారీరకంగా ఫ్రెష్ గా ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. . రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్‌లలో ఒకడన్న ద్రవిడ్..  అతని నేతృత్వంలో టీమిండియా 2023 ప్రపంచకప్‌ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.  

భారత జట్టు :  


తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్‌ బుమ్రా, జస్ప్రీతమ్‌మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

మూడో వన్డేకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ., అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.