ముంబై: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే మళ్లీ ముంబై రంజీ జట్టులోకి వచ్చారు. ఈ నెల 8 నుంచి హర్యానాతో జరిగే క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో వీళ్లిద్దరు బరిలోకి దిగనున్నారు. మొత్తం 18 మందితో కూడిన టీమ్‌ను ముంబై సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు.
ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సూర్య నిరాశపర్చినా, దూబే మాత్రం సూపర్ ఫామ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో సూర్య ఒక్క రంజీ మ్యాచ్ ఆడగా, దూబే కూడా జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. లిస్ట్–ఎ మ్యాచ్‌లో రాణించిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ హర్ష్ తన్నాను కూడా టీమ్‌లోకి తీసుకున్నారు.