![Ranji Trophy 2024: టెస్ట్ ఫార్మాట్ నీకు సెట్ కాదన్నా.. హర్యానా పేసర్ ధాటికి సూర్య దిమ్మతిరిగింది](https://static.v6velugu.com/uploads/2025/02/suryakumar-yadav-bowled-by-sumit-kumar-after-just-scoring-just-9-runs_FW8BvwfMDc.jpg)
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తనకు అచ్చోచ్చిన టీ20 ఫార్మాట్ లో ఇటీవలే తరచూ విఫలమవుతున్న సూర్య.. దేశవాళీ క్రికెట్ లోనూ ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమైన సూర్య.. శనివారం (ఫిబ్రవరి 8) హర్యానాతో క్వార్టర్ ఫైనల్లో విఫలమయ్యాడు. అభిమానులను నిరాశ పరుస్తూ కేవలం 9 పరుగులకే ఔటయ్యాడు. హర్యానా పేసర్ సుమిత్ కుమార్ బౌలింగ్ లో సూర్య క్లీన్ బౌల్డయ్యాడు.
ALSO READ | IND vs ENG: రెండో వన్డేకు కోహ్లీ సిద్ధం.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు
సుమిత్ వేసిన ఇన్ స్వింగ్ బౌలింగ్ కి సూర్య డిఫెన్స్ ఆడే క్రమంలో స్టంప్ ఎగిరి వెనకాల చాలా దూరంలో పడడం విశేషం. సూర్య సైతం ఈ అద్భుతమైన బంతికి షాకయ్యాడు. సూర్య ఔట్ పై నెటిజన్స్ బినా అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మనకు సెట్ ఫార్మాట్ సెట్ కాదు అన్నా అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు నువ్వు త్వరగా ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నాం అంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టులో సూర్యకు చోటు దక్కకపోవడంతో.. రంజీ ట్రోఫీ తర్వాత సూర్య ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడనున్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే సూర్యతో పాటు టాప్, మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో ప్రస్తుతం ముంబై తమ ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. క్రీజ్ లో కొటియన్ (76), ములానీ (78) ఉన్నారు. 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన తర్వాత వీరిద్దరూ అజేయంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. రహానే 31 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. మిగిలిన వారు విఫలమయ్యారు.
Suryakumar yadav wicket today pic.twitter.com/pIAEExdgYK
— Abhi (@79off201) February 8, 2025