Suryakumar Yadav : రెండు వన్డేల్లో డకౌట్.. సూర్య భాయ్ ఏమైంది?

Suryakumar Yadav  : రెండు వన్డేల్లో డకౌట్..  సూర్య భాయ్ ఏమైంది?

టీ20ల్లో హార్డ్ హిట్టర్ గా పేరు సంపాదించుకున్న  సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డేల్లో మాత్రం తనదైన మార్క్‌ చూపించలేకపోతున్నాడు. వరుస మ్యాచ్ లలో విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డే మ్యాచ్ లో తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. తొలి రెండు మ్యాచ్ లలో కూడా సూర్యకుమార్‌...  మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లోనే, ఎల్బీ రూపంలోనే వెనుదిరిగాడు.   ఈ  ఒక్క సిరీస్‌ అనే కాదు.. గత సిరీస్‌లలో కూడా సూర్య దారుణంగా విఫలమయ్యాడు. గత పది వన్డే మ్యాచ్‌లలను చూసుకుంటే  వరుసగా 13, 9,8, 4, 34, 6, 4, 31, 14 , 0 పరుగులు చేశాడు. 

గత పది ఇన్నింగ్స్‌లలో అతడు ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా సాధించకపోవడం గమానార్హం. దీంతో సూర్య ఆట పట్ల క్రికట్ అభిమానులు  నిరాశ చెందుతున్నారు.  దీంతో అతని స్థానంలో వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లను కోరుతున్నారు.  సంజూ శాంసన్‌ అనే ట్యాగ్‌ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.  మోకాలి గాయం నుంచి కోలుకున్న శాంసన్‌ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతనికి టీ20లలో పెద్దగా చెప్పుకొదగ్గ రికార్డులు ఎమీ లేనప్పటికీ వన్డేల్లో మాత్రం పర్వాలేదనిపించాడు.  అతడి గత 8 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే మొత్తం 272 పరుగులు చేశాడు. ఇందులో టాప్ స్కోర్ 82 గా ఉంది.