![సూర్యకుమార్ యాదవ్, నితీష్ రాణాపై ఐపీఎల్ నిర్వాహకులు సీరియస్](https://static.v6velugu.com/uploads/2023/04/captains_PVz4x6iMGB.jpg)
వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 16వ తేదీన కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 186 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ మరో 14 బంతులుండగానే ఛేదించింది. అయితే అద్బుతమైన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ కు అంపైర్ల షాకిచ్చారు. అతనిక జరిమానా విధించారు.
జరిమానా ఎందుకంటే..
ఈ మ్యాచ్‌లో సరైన సమయానికి ముంబై ఇండియన్స్ ఓవర్లను ముగించడంలో విఫలమైంది. దీంతో అంపైర్లు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు ఫైన్ వేశారు. స్లో ఓవర్ రేట్ కారణంగా సూర్యకు రూ.12 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ముంబై ఇండియన్స్ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నారు. మొదటి తప్పిదం కింద కేవలం రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నామని తెలిపారు.
కోల్కతా కెప్టెన్కు కూడా..
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణాకు కూడా ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. ఈ మ్యాచ్‌లో 10 బంతులు ఆడిన నితీష్ రాణా కేవలం 5 పరుగులే చేశాడు. బౌలర్ హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ఈ సమయంలో హృతిక్ యాటిట్యూడ్ చూపించాడు. రాణాను అవుట్ చేసి అతనికి ప్రత్యేక సైగలు చేశాడు. దీంతో ఆగ్రహించిన నితీష్ రాణా.. హృతిక్‌తో వాగ్వాదానికి దిగి..బూతులు తిట్టేశాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులు.. నితీష్ రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే హృతిక్ మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. వీళ్లిద్దరూ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఉల్లంఘించారని.. అందుకే జరిమానా విధించామని స్పష్టం చేశారు.