ODI World Cup 2023: అండర్ కవర్ ఏజెంట్‌గా సూర్య.. కెమెరా చేత పట్టి మెరైన్ డ్రైవ్‌లో

మన దేశంలో క్రికెటర్లకు, సినీ సెలెబ్రెటీలకు ఉన్న పాపులారిటీ గురుంచి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరు ఎక్కడ కనిపించినా.. వీరికి సంబంధించి ఏ చిన్న వార్త బయటకొచ్చినా అందరి కళ్ళు దానిపైనే ఉంటాయి. అందుకే వీరు మూడో కంటికి కనపడకుండా అన్ని పనులు సాగిస్తుంటారు. ఇలానే మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు గురించి అభిమానులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఒక అండర్ కవర్ ఏజెంట్‌గా పని చేశాడు. కాకపోతే, ఈ ప్రయత్నంలో అతనికి ఒక ఊహించని ఘటన ఎదురైంది.

సొంతగడ్డపై భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ టోర్నీలో ఓటమి ఎరగని జట్టేది అంటే మనదే. ఆడిన 6 మ్యాచ్‌ల్లో అన్నింటా విజయం సాధించింది. ఈ తరుణంలో భారత జట్టు గురుంచి సొంత అభిమానులు ఏమనుకుంటున్నారో తెలుసువాలనే ఆలోచన సూర్య మదిలో కలిగింది. వెంటనే తన ఆలోచనను బీసీసీఐతో పంచుకున్న సూర్య ఒక అండర్ కవర్ ఏజెంట్‌గా మిషన్ మొదలుపెట్టాడు. 

పిట్టలదొరలా సూర్య

అందరికీ తెలిసేలా వెళ్తే నిజం చెప్పరేమో.. అనుకున్నాడో కానీ, ముఖానికి మాస్క్, కళ్లద్దాలు, నెత్తిన టోపీ అబ్బో ఇలా సరికొత్త గెటప్‌లో బయలుదేరాడు సూర్య. చేతిలో కెమెరా పట్టుకొని ముంబై సముద్రతీరాన మెరైన్ డ్రైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఫేవరెట్ క్రికెట్ ఎవరు? భారత జట్టులోమీకు ఎవరంటే ఇష్టం? అంటూ ఇలా అక్కడ కనిపించిన వారికి కొన్ని ప్రశ్నలు సంధించాడు. సూర్య పిట్టలదొరలా ముస్తాబవడంతో తనను ఎవరూ గుర్తు పట్టలేదు. 

ALSO READ :- ODI World Cup 2023: పాండ్యాకు ఫిట్‌నెస్ కష్టాలు.. తదుపరి రెండు మ్యాచ్‌లకు అనుమానమే!

సూర్యపై మీ అభిప్రాయం..!

ఈ క్రమంలో సూర్య.. ఒక అభిమానిని తన గురుంచి ప్రశ్నించగా.. అతడు ఆటను మెరుగుపరుచుకోవాలని సూచించాడు. సూర్యకు ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావాలి. అతడు ఆటను ఇంకా ఇంప్రూవ్, అప్‍గ్రేడ్ చేసుకోవాలి అని సదరు అభిమాని కెమెరామెన్‍ సూర్యకు నేరుగా బదులిచ్చాడు. చివరకు ప్రశ్నలు పూర్తయ్యాక మాస్క్ తీసేసి అందరిని ఆశ్చర్యపరిచారు సూర్య. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.