టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ లో అతని చేతి వేలికి గాయమైంది. దీంతో కోయంబత్తూరులోటీఎన్‌సీఏతో జరుగుతున్న మ్యాచ్ మధ్యలోనే సూర్య వైదొలిగాడు. ఈ మ్యాచ్ లో 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించినా.. అజిత్ రామ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో సూర్య ఆడేది అనుమానంగా మారింది.
భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదిచడమే తన లక్ష్యమని ఇటీవలే చెప్పుకొచ్చిన ఈ టీ20 స్పెషలిస్ట్.. గాయంతో సెప్టెంబర్ 19 న బంగ్లాదేశ్ తో జరగబోయే సిరీస్ కు ఎంపిక కావడం కష్టంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ జట్టులో విపరీతమైన పోటీ ఉంది. ఈ సమయంలో సూర్యకు గాయం కావడం ప్రతికూలంగా మారింది. ప్రస్తుతం సూర్య భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వన్డే, టెస్టుల్లో అతనికి స్థానం లభించడం లేదు.
Also Read :- మూడో రౌండ్‌లోనే ఓడిన జొకోవిచ్
దేశవాళీ క్రికెట్ లో సూర్యకు అద్భుతమైన రికార్డ్ ఉంది. 2010లో ముంబై తరపున తన అరంగేట్రం చేసిన అతను 5,628 పరుగులు చేశాడు. 2023 లో డిసెంబర్ లో సౌతాఫ్రికా తో టీ20 సిరీస్ కు గాయపడ్డ సూర్య.. దాదాపు నాలుగు నెలల తర్వాత ఐపీఎల్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. మరోసారి గాయం కావడంతో అతని కెరీర్ పై సందేహాలు నెలకొన్నాయి.
Suryakumar Yadav gets injured while fielding in the Buchi Babu Tournament. (TOI).
— Tanuj Singh (@ImTanujSingh) August 31, 2024
- Not a good sign just before the Duleep Trophy..!!!! pic.twitter.com/TFpTpTYJYT