శభాష్ సూర్య: తొలి సిరీస్‌లోనే గొప్ప మనసు.. విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..?

శభాష్ సూర్య: తొలి సిరీస్‌లోనే గొప్ప మనసు.. విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..?

ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ప్రకటించినప్పుడు చాలా మంది విమర్శలు గుప్పించారు. వన్డే వరల్డ్ కప్ లో దారుణంగా విఫలమైన సూర్యకు  కెప్టెన్ గా చేశారని.. బీసీసీఐ తరచూ కెప్టెన్లను మారుస్తుందని..సీనియర్లు లేకుండా ఆసీస్ పై సిరీస్ గెలవడం అసాధ్యమని భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా, బ్యాటర్ గా అదరగొట్టాడు.

4-1 తో సిరీస్ గెలిపించడమే కెప్టెన్ గా గొప్ప మనసు చాటుకొని భారత మాజీ కెప్టెన్ ధోనీని గుర్తు చేసాడు. బెంగళూరు వేదికగా నిన్న (డిసెంబర్ 10) భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన 5 వ టీ 20లో టీమిండియా ఆసీస్ పై 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. బ్యాటింగ్ లో పెద్దగా రాణించకపోయినా బౌలర్లందరూ సమిష్టిగా పోరాడటంతో ఈ సిరీస్ ను 4-1 తో ముగించింది. ఈ మ్యాచ్ అనంతరం విన్నింగ్ ట్రోఫీని కెప్టెన్ కు సూర్యకు అందించగా.. టైటిల్ తీసుకెళ్లి రింకూ సింగ్, జితేష్ శర్మకు అందించాడు.

సూర్య కూడా యంగ్ ప్లేయర్ అయినప్పటికీ సహచరులకు ట్రోఫీ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. గతంలో ధోనీ సైతం విన్నింగ్ ట్రోఫీని కుర్రాళ్లకు అందజేసేవాడు. తాజాగా సూర్య అలాగే చేసి ధోనీని గుర్తు చేసాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 37 బంతుల్లో 53 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అక్షర్ పటేల్(31), జితేష్ శర్మ(24) చివర్లో వేగంగా పరుగులు చేశారు.

ఒక మాదిరి లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూల జట్టు 154 పరుగులకే పరిమితమైంది. మెక్ డెర్మాట్ 54 పరుగులు చేసి పోరాడినా మిగిలిన వారందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లలో ముకేశ్ కు 3 వికెట్లు, ఆర్ష దీప్ సింగ్, రవి బిష్ణోయ్ కు చెరో రెండు వికెట్లు లభించాయి.  అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.