ఐపీఎల్ లో వరుస పరాజయాలు వెంటాడుతున్న ముంబై ఇండియన్స్ కు శుభవార్త అందింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఫిట్‌గా ఉన్నట్లు తేలింది. మూడు నెలలకు పైగా క్రికెట్‌కు దూరమైన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ బుధవారం(ఏప్రిల్ 3) ఫిట్ గా ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో సూర్యా ఆదివారం (మార్చి 7) వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.
“సూర్య ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. NCA అతన్ని కొన్ని ప్రాక్టీస్ గేమ్‌లు ఆడేలా చేసింది. అతను ముంబై ఇండియన్స్ జట్టులో చేరవచ్చు. ఐపీఎల్ కు ముందు అతను మొదటి ఫిట్‌నెస్ టెస్ట్ లో 100% రికవరీ కాలేదు". అని బీసీసీలోని ఒక వర్గం ధృవీకరించింది. సూర్య ఫిట్ గా ఉండడంతో ఆ జట్టు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
తొలి మూడు మ్యాచ్ ల్లో సూర్య కుమార్ యాదవ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చిబువారి స్థానంలో నిలిచింది. తిలక్ వర్మ మినహాయిస్తే ఆ జట్టులో ఎవరూ కూడా నిలకడగా రాణించడం లేదు. దీంతో సూర్య రాక ముంబై జట్టును విజయాల బాట పట్టిస్తుందేమో చూడాలి.
SURYAKUMAR YADAV IS DECLARED FIT....!!!!
— Johns. (@CricCrazyJohns) April 3, 2024
- Surya is likely to play against Delhi Capitals on Sunday. [Devendra Pandey From Express Sports) pic.twitter.com/6jFfShOap4