IPL 2025: నిలకడకు మారుపేరుగా సూర్య.. వరుసగా 9 మ్యాచ్‌ల్లో ఇదెలా సాధ్యం

IPL 2025: నిలకడకు మారుపేరుగా సూర్య.. వరుసగా 9 మ్యాచ్‌ల్లో ఇదెలా సాధ్యం

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ప్రారంభంలో కాస్త తడబడిన సూరీడు ఆ తర్వాత తనదైన మార్కుతో చెలరేగాడు. ఈ మెగా టోర్నీలో ఎవరూ చూపించని నిలకడ చూపిస్తున్నాడు. బుధవారం (ఏప్రిల్ 23) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 19 బంతుల్లోనే 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఒక్కసారిగా ఆరెంజ్ క్యాప్ రేస్ లో నేను ఉన్నానని దూసుకొచ్చాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్ ల్లో 62 యావరేజ్ తో 373 పరుగులు చేశాడు.  వీటిలో రెండు హాఫ్ సెంచరీలు ఉండగా.. మూడు సార్లు నాటౌట్ గా నిలిచాడు. 

ఇదంతా పక్కనపెడితే ఈ టోర్నీలో ఎవరూ సాధించలేని రికార్డ్ సూర్య సాధించడం విశేషం. అదేంటో కాదు ఆడిన 9 మ్యాచ్ ల్లో 20కి పైగా స్కోర్లు చేశాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా 29, 48, 27*, 67, 28, 40, 26, 68*, 40* పరుగులు చేసి తన నిలకడను చూపించాడు. ప్రస్తుతం 373 పరుగులతో సూర్య నాలుగో స్థానంలో ఉన్నాడు. మొత్తం పది మంది ఆటగాళ్లు 300 పరుగుల మార్కును దాటారు. సాయి సుదర్శన్ 400 పరుగులు దాటినా ఏకైక వ్యక్తి. 417 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను సాయి సుదర్శన్ తన దగ్గరే ఉంచుకున్నాడు. 

ఇక ఐపీఎల్ ఈ సీజన్ ఐపీఎల్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్ 6 విజయాలతో టేబుల్ టాపర్ గా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 6 విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. ముంబై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్, లక్నో సూపర్ జయింట్స్ 10 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. కోల్ కతా 6 పాయింట్లతో 7 స్థానంలో ఉండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.