MI vs SRH: ఇది కదా కామెడీ అంటే.. అభిషేక్ శర్మ జేబు చెక్ చేసిన సూర్య

MI vs SRH: ఇది కదా కామెడీ అంటే.. అభిషేక్ శర్మ జేబు చెక్ చేసిన సూర్య

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ "నోట్ సెలెబ్రేషన్" ఇప్పటికీ వైరల్ అవుతుంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఊచ కోత కోస్తూ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న అభిషేక్.. 40 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్ గా 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 141  పరుగులు చేశాడు. సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ తన జేబులో పేపర్ చూపిస్తూ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. ఆ పేపర్ పై "థిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ" అని రాసి ఉంది. ఫ్యాన్స్ కు తన సెంచరీని అంకితం ఇచ్చాడు. 

ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య గురువారం (ఏప్రిల్ 17) వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మరోసారి అభిషేక్ నోట్ చర్చనీయాంశంగా మారింది. టాస్ ఓడి సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా ముంబై స్టార్ బ్యాటర్ సూర్య.. అతని దగ్గరకు వచ్చి జేబు చెక్ చేయడం విశేషం. అభిషేక్ వెనక వైపు నుంచి వచ్చి  జేబులో నోట్ ఉందా లేదా అని చెక్ చేసిన విధానం నవ్వు తెప్పిచింది. ఎంతో సరదాగా సాగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

Also Read :ముంబై చేతిలో సన్ రైజర్స్ చిత్తు.. ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం చేసుకున్న హైదరాబాద్

ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ పర్వాలేదనిపించాడు. 28 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్ లో ఔటయ్యాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో జాక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాక్స్, బోల్ట్, పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.