MI vs LSG: సూర్యకే ఆరెంజ్ క్యాప్.. కోహ్లీకి రావాలంటే నేడు ఎన్ని పరుగులు చేయాలంటే..?

MI vs LSG: సూర్యకే ఆరెంజ్ క్యాప్.. కోహ్లీకి రావాలంటే నేడు ఎన్ని పరుగులు చేయాలంటే..?

ఐపీఎల్ 2025 లోముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ చెలరేగి ఆడుతున్నాడు. ప్రారంభంలో కాస్త తడబడిన సూరీడు ఆ తర్వాత తనదైన మార్కుతో చెలరేగాడు. ఈ మెగా టోర్నీలో ఎవరూ చూపించని నిలకడ చూపిస్తున్నాడు. ఆదివారం (ఏప్రిల్ 27) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 28 బంతుల్లోనే 54 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సూర్య ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తో ఈ ముంబై వీరుడు అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 

ఈ మ్యాచ్ కు ముందు 373 పరుగులు చేసిన సూర్య.. హాఫ్ సెంచరీతో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ (417)ను ధాటి టాప్ (427) లోకి వెళ్ళాడు. ఈ లిస్ట్ లో కోహ్లీ 392 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టేబుల్ టాప్ లేపేందుకు అమీతుమీ తేల్చుకోనున్నారు. సాయంత్రం జరగబోయే మ్యాచ్ లో కోహ్లీ 36 పరుగులు చేస్తే సూర్యను ధాటి అగ్ర స్థానంలోకి వస్తాడు. అదే జరిగితే నేడు ఆరెంజ్ క్యాప్ కోల్ దగ్గరే ఉంటుంది. 

►ALSO READ | SL vs IND: ముగ్గురే కొట్టేశారు: బోణీ అదిరింది.. ట్రై సిరీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్

ఈ టోర్నీలో ఎవరూ సాధించలేని రికార్డ్ సూర్య సాధించడం విశేషం. అదేంటో కాదు ఆడిన 10 మ్యాచ్ ల్లో 20కి పైగా స్కోర్లు చేశాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా 29, 48, 27*, 67, 28, 40, 26, 68*, 40*, 54 పరుగులు చేసి తన నిలకడను చూపించాడు. ప్రస్తుతం 427 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సూర్య తో పాటు ఓపెనర్ రికెల్ టన్ (58) చెలరేగడంతో  మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.