
దుబాయ్ : టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటర్లలో నంబర్ వన్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. మూడు నెలల పాటు ఆటకు దూరమైన సూర్య బుధవారం విడుదలైన తాజా లిస్ట్‌లో టాప్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు. ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్న సూర్య ఖాతాలో 861 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఫిల్ సాల్ట్ 802 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బౌలర్లలో అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ తిరిగి టాప్–10లోకి వచ్చాడు. నాలుగు స్థానాలు మెరుగై తొమ్మిదో ర్యాంక్ సాధించాడు. బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ ఆల్ రౌండర్లలో నంబన్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.