టీమిండియా శ్రీలంకతో సిరీస్ కు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా మొదట టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. శనివారం (జూలై 27) పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు టీ20 సిరీస్ పై దృష్టి పెట్టింది. శ్రీలంకను వారి సొంతగడ్డపై మట్టికరిపించాలని వ్యూహాలను రచిస్తోంది. టీ20 ఫార్మాట్ కు సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించారు. సిరీస్ కు ముందు సూర్య తొలిసారి ఈ సిరీస్ గురించి మాట్లాడాడు.
"మీరు విజయం సాధించిన లేకపోతే విఫలమైనా ఎంత నిరాడంబరంగా ఉన్నారనేది నేను స్పోర్ట్స్ లో నేర్చుకున్నాను. నేను గ్రౌండ్ లో నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఇదే. మీరు ఏదైనా గ్రౌండ్ లో చేసినప్పుడు అది అక్కడే వదిలేయాలి. క్రికెట్ మీ జీవితంలో ఒక భాగం. జీవితంలో విజయాలు, పరాజయాలు వచ్చినా ఒకేలా ఉండాలి". అని బీసీసీఐ అప్‌లోడ్ చేసిన వీడియోలో సూర్యకుమార్ అన్నారు.
Also Read:- లీగ్‌లు ఆడుకుంటున్నాను.. పాకిస్థాన్ తరపున ఆడే ఉద్దేశ్యం లేదు
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత్, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న జరగనుండగా.. చివరి రెండు మ్యాచ్‌లు వరుసగా జూలై 28, 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. టీ20 సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్.. వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.
𝗦𝘂𝗿𝘆𝗮𝗸𝘂𝗺𝗮𝗿 𝗬𝗮𝗱𝗮𝘃 𝘁𝗮𝗸𝗲𝘀 𝗴𝘂𝗮𝗿𝗱 𝗮𝘀 #𝗧𝗲𝗮𝗺𝗜𝗻𝗱𝗶𝗮'𝘀 𝗧𝟮𝟬𝗜 𝗰𝗮𝗽𝘁𝗮𝗶𝗻! 🧢#SLvIND | @surya_14kumar pic.twitter.com/KmWz84jZnP
— BCCI (@BCCI) July 26, 2024