SMAT 2024: సూర్య గొప్ప మనసు.. రహానే సెంచరీ కోసం ఏం చేశాడంటే..?

SMAT 2024: సూర్య గొప్ప మనసు.. రహానే సెంచరీ కోసం ఏం చేశాడంటే..?

సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముస్తాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ టీ20 టోర్నీలో అజింక్యా రహానే సూపర్ ఫామ్ కొనసాగుతోంది. వరుసగా హాఫ్ సెంచరీలు చేసి దూసుకెళ్తున్న ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ ముస్తాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ టీ20 టోర్నీలో సత్తా చాటాడు. 56 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 98 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అవకాశం ఉన్నపటికీ రహానే రెండు పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రహానే సెంచరీ కోసం సూర్య తన శైలికి భిన్నంగా ఆడడం విశేషం. 

ఈ మ్యాచ్ లో సూర్య 7 బంతుల్లో ఒక పరుగే చేసి ఔటయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో బౌలర్లను ఉతికారేసే సూర్య దేశవాళీ క్రికెట్ లో ఇలాంటి ఆట తీరు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే సూర్య రహానే సెంచరీ కోసం డాట్ బాల్స్ ఆడాడు. ముంబై విజయానికి చేయాల్సిన పరుగులు 10. ఈ సమయంలో రహానే 90 పరుగుల వద్ద బ్యాటిగ్ చేస్తున్నాడు. దీంతో 16 ఓవర్ చివరి మూడు బంతులను డాట్ బాల్స్ గా ఆడాడు. చివరి బంతి బౌండరీ వద్దకు వెళ్లినా సింగిల్ కోసం రాలేదు. సూర్య ఇచ్చిన అవకాశాన్ని రహానే సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 

ALSO READ | NZ vs ENG: బ్యాడ్ లక్ అంటే ఇదే: చేజేతులా వికెట్ పారేసుకున్న విలియంసన్

98 పరుగుల వద్ద భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. రహానే ఔటైనా సూర్య ఆలోచన విధానం అందరినీ ఆకట్టుకుంది. రహానేతో పాటు కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (46) కూడా రాణించడంతో.. శుక్రవారం జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాపై నెగ్గింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిన బరోడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. 159 పరుగుల లక్ష్యాన్ని ముంబై 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది.