IPL 2025: కెప్టెన్సీ ఇస్తాం.. కోట్లలో డబ్బులిస్తాం: సూర్యకు KKR బంపరాఫర్

IPL 2025: కెప్టెన్సీ ఇస్తాం.. కోట్లలో డబ్బులిస్తాం: సూర్యకు KKR బంపరాఫర్

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఎప్పుడూ లేని విధంగా హైప్ కలిగిస్తుంది. ఏ ప్లేయర్లు మెగా ఆక్షన్ లోకి వస్తారో.. ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటారనే విషయం ఒక కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్లపైనే అందరి ఫ్రాంచైజీల కన్ను ఉన్నట్టు సమాచారం. హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ప్రకటించడంతో సూర్య కుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ టీ20 స్పెషలిస్ట్ పై  కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కన్నేసినట్టు వస్తున్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి.

నివేదికల ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్సీ ఆఫర్ వచ్చిందట. సూర్య కెప్టెన్ గా ఒప్పుకుంటే అతనికి ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి కేకేఆర్ యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్టు టాక్. సూర్య వస్తే కేకేఆర్ జట్టు కెప్టెన్ గా ఉన్న అయ్యర్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించారు.

టీ20 ల్లో సూర్య ఎంత ప్రమాదకర బ్యాటర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో సూర్య రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి ముంబై కెప్టెన్సీ ఇవ్వకపోతే మెగా ఆక్షన్ లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయ్యర్ సారధ్యంలో కేకేఆర్ జట్టు 2024 ఐపీఎల్ సీజన్ లో విజేతగా నిలిచింది. రిపోర్ట్స్ ప్రకారం శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ లతో పాటు విండీస్ ఆల్ రౌండర్లు నరైన్, రస్సెల్ ను కేకేఆర్ జట్టు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.