భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాలని ఆశించిన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. గాయంతో అతను దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదిచడమే తన లక్ష్యమని ఇటీవలే చెప్పుకొచ్చిన ఈ టీ20 స్పెషలిస్ట్.. గాయంతో సెప్టెంబర్ 19 న బంగ్లాదేశ్ తో జరగబోయే సిరీస్ కు ఎంపిక కావడం కష్టంగానే కనిపిస్తుంది.
బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ లో అతని చేతి వేలికి గాయమైంది. దీంతో కోయంబత్తూరులోటీఎన్‌సీఏతో జరుగుతున్న మ్యాచ్ మధ్యలోనే సూర్య వైదొలిగాడు. ఈ మ్యాచ్ లో 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించినా.. అజిత్ రామ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ జట్టులో విపరీతమైన పోటీ ఉంది. ఈ సమయంలో సూర్యకు గాయం కావడం ప్రతికూలంగా మారింది. ప్రస్తుతం సూర్య భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వన్డే, టెస్టుల్లో అతనికి స్థానం లభించడం లేదు.
దేశవాళీ క్రికెట్ లో సూర్యకు అద్భుతమైన రికార్డ్ ఉంది. 2010లో ముంబై తరపున తన అరంగేట్రం చేసిన అతను 5,628 పరుగులు చేశాడు. 2023 లో డిసెంబర్ లో సౌతాఫ్రికా తో టీ20 సిరీస్ కు గాయపడ్డ సూర్య.. దాదాపు నాలుగు నెలల తర్వాత ఐపీఎల్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. మరోసారి గాయం కావడంతో అతని కెరీర్ పై సందేహాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 5 నుండి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
Suryakumar Yadav Misses Duleep Trophy's First Round#SuryakumarYadav #DuleepTrophy #Cricket pic.twitter.com/9Y6eu8QOwf
— GBB Cricket (@gbb_cricket) September 2, 2024