అది ధోనీ అంటే.. కండ్లు మూసి తెరిసే లోపు సూర్య మెరుపు స్టంప్ ఔట్

అది ధోనీ అంటే.. కండ్లు మూసి తెరిసే లోపు సూర్య మెరుపు స్టంప్ ఔట్

టీమిండియా మాజీ క్రికెటర్ మహేంధ్ర సింగ్ ధోనిని వికెట్ల వెకన మిషన్ అంటుంటారు ఆయన అభిమానులు. అందుకు కారణం ధోని చేసే స్టంప్ ఔట్లే. వికెట్ల వెనక ధోని మెరుపు వేగంతో కదులుతారు. బ్యాటర్లు క్రీజు వదిలి బయటకు వెళ్లారంటే సెకండ్ల వ్యవధిలోనే స్టంప్స్‎ను గిరాటేస్తాడు. కీపర్‎గా ధోని ఉన్నాడంటే కొందరు బ్యాటర్లు క్రీజు వదిలి బయటకు వెళ్లి ఆడే సహయం చేయరంటే అతిశయోక్తి కాదు. 

ఇప్పటికే ఎన్నో ఊహించలేని స్టంప్ ఔట్లతో ధోని ప్రపంచలోని బెస్ట్ వికెట్ కీపర్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ధోని మరోసారి తన కీపింగ్ స్కిల్స్‎తో అభిమానులను అలరించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం (మార్చి 23) చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచులో ముంబై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‎ను మెరుపు స్టంప్ ఔట్ చేసి పెవిలియన్ పంపించాడు ధోని. 

ALSO READ | SRH vs RR IPL 2025: రాజస్థాన్‌పై ఘన విజయం.. గెలుపుతో టోర్నీ స్టార్ట్ చేసిన సన్ రైజర్స్

కేవలం 12 సెకండ్ల వ్యవధిలోనే సూర్యను స్టంప్ ఔట్ చేసి తాను బెస్ట్ కీపర్ అనడానికి రీజన్ ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించాడు తలా. ముంబై ఇన్సింగ్స్ 10.3 బంతిని స్పిన్నర్ నూర్ అహ్మద్ గూగ్లీ వేయగా.. కెప్టెన్ సూర్య క్రీజు నుంచి బయటకు వచ్చి షాట్ఆడేందుకు ప్రయత్నించాడు. గింగిరాలు తిరుగుకుంటూ వెళ్లిన బాల్ సూర్య బ్యాట్‎కు కనెక్ట్ కాకుండా నేరుగా కీపర్ ధోని చేతుల్లో పడింది. అప్పటికే వికెట్ల వెనక అప్రమత్తమంగా ఉన్న ధోని మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. 

ALSO READ | SRH vs RR IPL 2025: సెంచరీతో శివాలెత్తిన కిషాన్.. రాజస్థాన్‌ టార్గెట్ 287 పరుగులు

సూర్య తిరిగి క్రీజులోకి వచ్చే లోపే బెయిల్స్ కిందపడిపోయాయి. కేవలం 12 సెకండ్లలోనే ధోని స్టంపింగ్ చేశాడు. స్టంప్ ఔట్‎పై ధోని ఫుల్ కాన్ఫిడెంట్‎గా ఉండటంతో సూర్య థర్డ్ అంపైర్ కాల్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా పెవిలియన్ బాటపట్టాడు. చాలా రోజుల తర్వాత గ్రౌండ్లో కనిపించిన ధోని.. మెరుపు వేగంతో స్టంప్ ఔట్ చేయడంతో తలా అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. సూర్యను మెరుపు వేగంతో ధోని స్టంప్ ఔట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.