
సోషల్ మీడియాలో ముంబై టీమ్ బాగా ట్రోలింగ్ కు గురవుతోంది. లక్నోతో మ్యా్చ్ లో ఆ టీమ్ తీసుకున్న నిర్ణయం అట్టర్ ఫ్లాప్ కావడంతో ఫ్యాన్స్, సీనియర్స్, మాజీలు బహిరంగంగానే విమర్శించారు. ఫామ్ లో ఉన్న బ్యాటర్ ను వెనక్కు పంపాల్సిన అవసరం ఏముంది అని సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు పెదవి విరిచారు. ఇక ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. చెత్త డెసిషన్ అంటూ విమర్శిస్తున్నారు.
తిలక్ వర్మను సడెన్ గా వెనక్కు పంపించడం ఆ టీమ్ సభ్యులకు కూడా నచ్చలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వెళ్లిన తిలక్.. 23 బాల్స్ లో 25 రన్స్ చేశాడు. ఆ టైంలో తిలక్ ను రిటైర్డ్ అవుట్ ఇప్పించి మిచెల్ సాంట్నర్ ను క్రీజులోకి పంపించారు. అంతకు ముందే అవుట్ అయ్యి మ్యాచ్ చూస్తున్న సూర్య కుమార్ యాదవ్.. ఆ నిర్ణయం గురించి తెలిసి షాకింగ్ కు గురయ్యాడు. సూర్యకుమార్ ఎక్స్ ప్రెషన్స్ వైరల్ అవుతున్నాయి.
Indian T20i captain Suryakumar Yadav is not happy with the Tilak retire out decision.This is not how u give confidence to youngsters. MI if u still want to win trophies it's high time to sack Hardik and make SKY captain pic.twitter.com/JB4vf9CvBn
— Vikas Yadav (@imvikasyadav_1) April 5, 2025
టీమ్ డెసిషన్ పై పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశాడు సూర్య కుమార్. ‘‘ఏంటీ షాకింగ్ డిసెషన్’’ అని ఆశ్చర్యానికి గురయ్యాడు. ‘‘ఎందుకు ఇలా చేశారు’’ అన్నట్లుగా సీరియస్ అయ్యాడు. దీనికి మెంటర్ మహేలా జయవర్ధనే ఏదో సమాధానం చెప్తున్న వీడియో వైరల్ గా మారింది.
Also Read :- ఆ చెత్త నిర్ణయంతో ముంబైకి తగిన శాస్తి
మ్యాచ్ చివర్లో 7 బంతుల్లో 24 రన్స్ చేయాల్సి ఉండగా తిలక్ ను వెనక్కు పంపించారు. కానీ ఆ స్ట్రాటజీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి 191 రన్స్ మాత్రమే చేయగలిగారు. 12 రన్స్ తేడాతో ముంబై ఓడిపోయింది.
సూర్య కుమార్ అసంతృప్తికి కారణం లేకపోలేదు. ఎందుకంటే తిలక్ ఆట ఏంటో బాగా తెలిసినోడు. తిలక్ లాంటి బ్యాటర్లు చివరి వరకు ఉంటే ఒక్కడో ఒకచోట బౌండరీలు, సిక్సర్లు కొట్టడం పెద్ద కష్టమేం కాదు. అంత హిట్టర్ ను రిటైర్డ్ అవుట్ చేయడమేంటి అన్నట్లు సూర్య డిజప్పాయింట్ అయిపోయాడు.