బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ మాటలు నమ్మి మోసపోవద్దు : సంకినేని వెంకటేశ్వర్ రావు

సూర్యాపేట, వెలుగు:  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్ నాయకులు మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూర్యాపేట  బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు ప్రజలకు సూచించారు. మంగళవారం చివ్వెంల మండలంలో ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మాటలు నమ్మి మోసపోయామని,  ఈ సారైనా జాగ్రత్తగా ఉండాలన్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని, దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి లాంటి పథకాలు ఎన్నికల కోసమే తీసుకొచ్చారని విమర్శించారు.  

దళితబంధు పథకాన్ని కార్యకర్తలకే ఇచ్చారని, ఇందులోనూ ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. తనకు అవకాశం ఇస్తే పేటకు రైల్వే మార్గం, ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌లపై అండర్ పాస్‌‌‌‌ల ఏర్పాటుతో పాటు  విద్య, వైద్యం, రైతులకు రెండు బస్తాల యూరియా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకముందు  ఆత్మకూర్ ఎస్ మండలం కొత్తగూడెం, ఏపూర్ బోడతండా  గ్రామాలకు చెందిన సుమారుగా 60 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను వీడి బీజేపీలో చేరారు.  

ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పేర్వాల లక్ష్మణరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్ శ్రీనివాస్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు జంపాల వెంకన్న , బిట్టు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.