పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌ సూచించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో మూడు లక్షల మొక్కలు నాటాలని ఆదేశించారు. మొక్కల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అటవీ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలోని అన్ని పార్కుల్లో 75 ఆకృతిలో ఫ్రీడం పార్కులను సిద్ధం చేయాలన్నారు. మొక్కలు నాటే ప్రోగ్రాంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలని ఆదేశించారు. డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో ముకుందరెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎస్పీ నాగభూషణం, పీడీ కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డీఏవో రామారావునాయక్, డీహెహచ్‌‌‌‌‌‌‌‌వో శ్రీధర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, ఆఫీసర్లు అనసూర్య, జ్యోతి పద్మ, శంకర్ పాల్గొన్నారు.స్వాతంత్ర్య ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటాలి

యాదాద్రి, వెలుగు : స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. వజ్రోత్సవాల్లో భాగంగా భువనగిరి మండలం గౌస్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, భూదాన్‌‌‌‌‌‌‌‌పోచంపల్లిలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 75 ఆకృతిలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రామాన్ని వేగవంతం చేయాలని సూచించారు. గౌస్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో కోతుల కోసం వివిధ రకాల పండ్ల మొక్కలు నాటడాన్ని అభినందించారు. మ్యారీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌ తివారీ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్లు ఆంజనేయులు, విజయలక్ష్మి, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్లు కృష్ణయ్య, లింగస్వామి పాల్గొన్నారు.

జాతీయ జెండాల పంపిణీ

తుంగతుర్తి/మేళ్లచెరువు/దేవరకొండ/హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, మేళ్లచెరువు, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, నల్గొండ జిల్లా దేవరకొండలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. మేళ్లచెరువు కస్తూరిబా స్కూల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లు వజ్రోత్సవ అక్షరాల ఆకృతిలో కూర్చున్నారు. తిరుమలగిరిలో మున్సిపల్​ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పోతరాజు రజినీరాజశేఖర్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ శ్రీను, దేవరకొండలో బీజేపీ లీడర్లు గార్లపాటి జితేందర్‌‌‌‌‌‌‌‌, నల్గొండ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, నాయకులు నీలా రవికుమార్, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ మంగ్తా, వార్డర్‌‌‌‌‌‌‌‌ సీతయ్య పాల్గొన్నారు.

వేడుకల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

కోదాడ/హాలియా/నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే నోముల భగత్‌‌‌‌‌‌‌‌, నకిరేకల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పిలుపునిచ్చారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లతో కలిసి గాంధీ సినిమా చూశారు. అనంతరం అల్వాలపురంలో మొక్కలు నాటి, జాతీయ జెండాలను పంపిణీ చేశారు. హాలియా మున్సిపాలిటీలోని 2వ వార్డు అలీనగర్‌‌‌‌‌‌‌‌లో ఫ్రీడం పార్కును ఎమ్మెల్యే నోముల భగత్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించగా, హాలియా, తిరుమలగిరిలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి మొక్కలు నాటారు. అలాగే చిట్యాలలో ఉరుమడ్లలో నకిరేకల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మొక్కలు పంపిణీ చేశారు.