సూర్యాపేట, వెలుగు: ‘‘సీఎం సార్.. మీ కాళ్లు మొక్కుతం.. మాకు న్యాయం చేయండి.. జీవో 46తో ఉద్యోగం రాకుండా పోయింది..’’అని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం సూర్యాపేట ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగా అభ్యర్థులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.
‘‘పోలీస్ నియామకంలో జీవో 46 వల్ల ఉద్యోగాలు రాకుండా పోయాయి.. మాకు న్యాయం చేయండి.. మా ఉద్యోగాల మీదే మా కుటుంబాల బతుకులు ఆధారపడి ఉన్నాయి..’’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. దీనిపై తర్వాత మాట్లాడుకుందాం అనడంతో అభ్యర్థులు ఫ్లెక్సీ దించేశారు.