అవిశ్వాస తీర్మానం గెలిచిన కాంగ్రెస్ పార్టీ

సూర్యాపేట జిల్లాలో అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఆర్డీవో వేణు మాధవరావు అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం నిర్వహించారు. ఈ తీర్మాణంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.

అవిశ్వాసానికి అనుకూలంగా 15 మంది సభ్యులు ఉండగా.. 13 మంది సభ్యులు చేతులు లేపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెయిల్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు చేసుకుంటున్నారు. 
 

ALSO READ :- రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ : జీవన్ రెడ్డి