మాజీ బ్యాంక్ మేనేజర్ భారీ కుంభకోణం వినియోగదారుల పేరిట కోట్ల రుణాలు

సూర్యాపేట జిల్లా: ఎస్బీఐ బ్యాంక్ లో మాజీ మేనేజర్ కోట్లు కాజేశాడు. సూర్యాపేట ఎస్బీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ షేక్ సైదులు వినియోగదారుల పేరిట వారికి తెలియకుండా లోన్లు తీశాడు. బాధితుడు శ్యామ్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. ఇంకా సైదులు గతంలో పని చేసిన బ్యాంక్ బ్రాంచ్ ల్లో విచారణ చేస్తున్నారు.  రూ.4.5 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాదారులకు తెలియకుండానే వారి పేర్ల మీద రుణాలు తీసుకున్నాడు. షేక్ సైదులు ఇంకా ఎంతమందిపై బ్యాంక్ రుణాలు తీసుకున్నాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.