బర్ల దొడ్డి కాదు.. బడి వంటగది!

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి మోడల్ స్కూల్ వంటగది ఇది. వానొచ్చినా.. వరదొచ్చినా.. దాదాపు 600 మంది విద్యార్థులకు రోజూ ఇక్కడే వంట, వడ్డింపు. ఇక పిల్లలు కూర్చోని తినడానికి  డైనింగ్ హాల్ దేవుడెరుగు. కిచెన్ షెడ్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. చదువు, ఆటల్లో మెరిట్​లో ఉన్న తమ స్కూల్​కు కిచెన్, డైనింగ్​హాల్ నిర్మించి ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.

ALSO READ : కేంద్రీయ విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీ