సూర్యాపేట జిల్లాలో ఆత్మీయ కలయిక

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల జడ్పీహెచ్‌ఎస్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం 2003–04 బ్యాచ్‌ విద్యార్థులు ఒక్కచోటుకు చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు.