మద్యం మత్తులో భక్తులపై దాడి.. కానిస్టేబుల్ కాలర్​ పట్టుకుని బూతు పురాణం

మఠంపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో మద్యం మత్తులో  ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న కార్ల పై దాడి చేశాడు. ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..  మఠంపల్లికి చెందిన యల్లావుల నాగరాజు యాదవ్  సంపత్ వైన్స్​లో  తప్పతాగి రోడ్డుపై వెళ్తున్న  వాహనాలపై రాళ్లు విసిరాడు . 

దీంతో మట్టపల్లి దైవ దర్శనానికి వెళ్తున్న  భక్తుల కారుపై  రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టాడు. అంతేకాకుండా కారులో ఉన్న మహిళలపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితులు 100 కు కాల్ చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు మద్యం తాగిన నాగరాజును నిలువరించే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ కాలర్ పట్టుకుని  దుర్భాషలాడాడు . నిందితుడు నాగరాజును పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా గొడవ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.