రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా సూర్యాపేట జిల్లా జట్టు

రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా సూర్యాపేట జిల్లా జట్టు

ఆదిలాబాద్, వెలుగు: నాలుగు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 71వ కబడ్డీ పోటీలు శుక్రవారం ముగిశాయి. విజేతగా సూర్యాపేట జిల్లా జట్టు, రన్నర్‎గా నల్గొండ జిల్లా జట్టు నిలిచాయి. వనపర్తి, రంగారెడ్డి జిల్లాల జట్లకు సంయుక్తంగా మూడో బహుమతి దక్కింది. ఆయా జిల్లాల జట్లకు ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఉష్కం రఘుపతి, అంతర్జాతీయ కబడ్డీ సంఘం డైరెక్టర్ జగదీశ్​ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మహేందర్ రెడ్డి అవార్డులను అందజేశారు.