వరిలో సూర్యాపేట జిల్లా టాప్.. 3 లక్షల ఎకరాల్లో వరినాట్లు..

ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో ఒక్క వరినాట్లే 3.09 లక్షల 251 ఎకరాల్లో వేశారు. ఇప్పటిదాకా ఇదే టాప్ కాగా..వరినాట్ల సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ తరువాత నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో 3.02లక్షల ఎకరాల్లో వరినాట్లు జరిగాయి. నల్గొండలో 2.12లక్షల ఎకరాల్లో , సిద్ధిపేట జిల్లాలో 2.04లక్షల ఎకరాలు,  యాదాద్రిలో 1.54లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 1.52లక్షల  ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జగిత్యాలలో 1.15లక్షల ఎకరాలు, జనగాంలో 92వేల ఎకరాల్లో, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో 89వేల ఎకరాల్లో , సిరిసిల్ల జిల్లాలో 89వేల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ నివేదికలో తేలింది.

మిగతా పంటలు అంతంతే..

యాసంగి పంటల్లో మిగతా పంటలు అంతంత మాత్రంగానే సాగు జరుగుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా వరి తరువాత మక్కలు 5.68లక్షల ఎకరాల్లో సాగు చేయగా .. పల్లి పంట 2.21లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. పప్పు శనగలు (బెంగాల్​గ్రామ్​) 2.13లక్షల ఎకరాల్లో వేశారు. వీటి తరువాత జొన్నలు 1.33లక్షల ఎకరాల్లో, మినుములు 40 వేల ఎకరాల్లో సాగు కాగా, పొద్దు తిరుగుడు 11,253 ఎకరాల్లో,  సాఫ్​ ప్లవర్​ 6280 ఎకరాల్లో, ఆయిల్​ సీడ్స్​ 2.39లక్షల ఎకరాల్లో సాగు చేయగా, పప్పు దినుసులు 2.66లక్షల ఎకరాల్లో వేశారు. మిగతా పంటలు 32వేల ఎకరాల్లో సాగు చేసినట్లు  అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ నివేదికలో స్పష్టమైంది.