నేరేడుచర్ల(పాలకవీడు), వెలుగు : తాగునీటి సమస్య తీర్చిన వారికే ఓటు వేస్తామని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం చెరువు తండా గ్రామస్తులు చెప్పారు. బుధవారం జాన్ పహాడ్ రోడ్డుపై ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తండాలో తాగునీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామపంచాయతీ బోరు ఉన్నా.. పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : హైదరాబాద్లో విషాదం: మూడేళ్ల పిల్లోడి మీదుగా వెళ్లిన స్కూల్ బస్సు..
ప్రస్తుతం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలపై వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నామని చెప్పారు. కృష్ణా నది నుంచి పైపు లైన్ నిర్మించి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.