మాజీ సర్పంచ్ హత్య కేసు.. సూర్యాపేట డీఎస్పీపై వేటు

మాజీ సర్పంచ్ హత్య కేసు..  సూర్యాపేట డీఎస్పీపై వేటు

సూర్యపేట డీఎస్పీ రవిపై వేటు పడింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాలలో ఇటీవల జరిగిన గ్రామ మాజీ సర్పంచి మెంచు చక్రయ్య గౌడ్ మర్డర్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పోలీస్ ఉన్నతాధికారులు డీఎస్పీపై చర్యలు తీసుకున్నారు. ఆయనను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఐజీ సత్యానారాయణ  ఉత్త ర్వులు జారీ చేశారు. ఇందులో నిర్లక్ష్యం వహించిన తుంగతుర్తి సీఐ శ్రీనునాయక్ ను బదిలీ చేయగా ఎస్ఐకి మెమో జారీ చేశారు. సూర్యాపేట ఇన్ చార్జ్ డీఎస్పీగా కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

ALSO READ | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో.. మాటల్లో కాదు చేతల్లో చూపించాం: మంత్రి శ్రీధర్ బాబు

2025  మార్చి 17 న  సూర్యాపేట జిల్లాలో మాజీ సర్పంచ్‌ మెన్చు చక్రయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.  నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌‌ మెన్చు చక్రయ్య మార్చి 21న ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని తిరిగి వస్తూ గ్రామ శివారులోని ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడ్డ చక్రయ్య కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని చక్రయ్యను సూర్యాపేట హాస్పిటల్‌‌కు తరలించగా ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ చనిపోయాడు.

మాజీ సర్పంచ్ చక్రయ్యగౌడ్ హత్య కేసును త్వరలో ఛేదిస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మల్టీజోన్ –2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య కుటుంబ సభ్యులను ఎస్పీ నరసింహతో కలిసి ఐజీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సర్పంచ్ హత్యలో సొంత బంధువుల హస్తం ఉన్నట్లు గుర్తించామని, సొంత అల్లుళ్లే ప్రాధాన పాత్ర పోషించారని తెలిపారు.  ఇంకా విచారణ కొనసాగుతుందని, ఏ ఒక్కరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు.