కారు తీసుకుని ఇవ్వట్లేదని.. సూర్యాపేట మఠంపల్లి ఎస్ఐ సస్పెండ్

కారు తీసుకుని ఇవ్వట్లేదని.. సూర్యాపేట మఠంపల్లి ఎస్ఐ సస్పెండ్

సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సై రామాంజనేయులును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. మఠంపల్లికి చెందిన ఓ వక్తి కారును తిరిగి ఇవ్వకుండా అతడిని వేధించినందుకు సస్పెండ్ చేశారు మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ.

మఠంపల్లికి చెందిన ఓ  వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు.  వాళ్ల కారు మఠంపల్లిలోనే ఉండడంతో దానిని సొంత అవసరాల కోసం వాడుతున్నాడు ఎస్సై.  కారును తిరిగి ఇవ్వకపోగా..అతడిని  ఇబ్బందులు పెడుతున్నాడు ఎస్సై రామాంజనేయులు.  మూడు రోజుల క్రితం కారు యాజమాని డీజీపీ, జిల్లా ఎస్పీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.  ఎస్సై రామాంజనేయులపై విచారణ చేపట్టిన అధికారులు.. ఎస్సై రామాంజనేయులు చేసిన అక్రమాలను బయటకు లాగారు.

ఎస్సై రామాంజనేయులుపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు విచారణలో తేలింది, పిడియస్ బియ్యం అక్రమ రవాణాలో  భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గతంలో ఓ  మహిళను మోసం చేసినట్లు విచారణలో తేలింది.  మఠంపల్లి మండలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉండటంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు.