కృష్ణాజలాల వివాదం ప్రజల జీవన్మరణ సమస్య : జగదీశ్ రెడ్డి

  •     సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

నల్గొండ, వెలుగు :  కృష్ణాజలాల వివాదం ప్రజల జీవన్మరణ సమస్య అని, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి రావాలని  సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.  సోమవారం నల్గొండ పట్టణం మర్రిగూడ బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీంద్రకుమార్,  మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య,  జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ పారాటంతోనే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు.  

కృష్ణాజలాలపై పోరాడాల్సిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు తమపై ఎదురు దాడి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  కేంద్రంతో లోపాయికారి ఒప్పందం ఉందని, వాళ్ల చేతకాని తనం వల్లే కృష్ణా జలాలపై హక్కును కోల్పోయామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, కృష్ణా జలాల వివాదం వస్తే మేడిగడ్డ పోయి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇది హక్కుల సమస్య అని, రాజకీయాలకు సమయం కాదని స్పష్టం చేశారు. సీఎం, మంత్రులు నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎందుకు సందర్శించడం లేదని ప్రశ్నించారు.  వారి వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హయాంలో కృష్ణా ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయని, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీకి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకున్నా తాము అంగీకరించలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేతలు ఏపీ నేతలకు ఏజెంట్లుగా మారి తెలంగాణకు ద్రోహులయ్యారని విమర్శించారు.  ప్రజలందరు మరోసారి నీటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని, సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సభ సమన్వయకర్త రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్,  మాజీ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, నేతలు గుత్తా అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రేగట్టే మల్లికార్జునరెడ్డి, రావుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బోనగిరి దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.