సూర్యాపేటలో భారీ ఎత్తున నిషేదిత అంబర్, గుట్కా బస్తాలను పట్టుకున్నారు పోలీసులు. మోతే మండలంలో జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న సరుకును పట్టుకున్నారు పోలీసులు.మోతే మండలం మామిల్లగూడెం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా హైదరాబాదు నుండి ఖమ్మం కు అక్రమంగా అశోక్ లేలాండ్ దోస్త్ వాహనంలో 30 బస్తాల అంబర్ ప్యాకెట్లు,ఐదు బస్తాల విమల్ ప్యాకెట్లను పట్టుకున్నట్లు తెలిపారు పోలీసులు.
సుమారు వీటి విలువ ఆరు లక్షల 99 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ చింట నాగరాజు ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.