పెద్దగట్టు జాతర.. 2 వేల మంది బందోబస్తు.. 60 సీసీ కెమెరాలతో మానిటరింగ్

పెద్దగట్టు జాతర.. 2 వేల మంది బందోబస్తు.. 60 సీసీ కెమెరాలతో మానిటరింగ్

పెద్దగట్టు జాతరకు భారీబందోబస్తు ఏర్పాటు చేశామన్నారు  సూర్యాపేట ఎస్పీ సంప్రీత్ సింగ్ .  2 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు.   భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకోవాలని సూచించారు.    పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో ఏర్పాట్లను 60 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు.

ALSO READ | సూర్యాపేట జిల్లా: దురాజ్​పల్లి లింగమతుల జాతర విశేషాలివే..

 హైదరాబాద్  విజయవాడ నేషనల్ హైవేపై  ట్రాఫిక్  డైవర్షన్ ఏర్పాటు చేశామని చెప్పారు ఎస్పీ సంప్రీత్ సింగ్.  జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల లైవ్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్వేక్షిస్తాం.   గుట్ట చుట్టూ, పైన భద్రత చర్యలు, పోలీస్ బందోబస్తు, ప్రత్యేక టీంలు పనిచేస్తున్నాయి.  ఎగ్జిబిషన్ రోడ్డు, కోనేరు, వీఐపీ మార్గం, హైవేపై వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు సిబ్బంది తనిఖీ చేస్తున్నారు .  జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దైవదర్శనం కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు అని తెలిపారు ఎస్పీ.

ట్రాఫిక్ మళ్లింపు  ఇలా

పెద్ద గట్టు జాతర సందర్భంగా 65వ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాతీయ రహదారిపై ఆదివారం నుంచి భారీ వాహనాలను దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ వైపు మళ్లించారు. అలాగే విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద హుజూర్‎నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వైపు మళ్లించారు.

ALSO READ | శివరాత్రికి స్పెషల్ బస్సులు .. హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్లే భక్తులకి శుభవార్త

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన దురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఫిబ్రవరి 16 ఆదివారం రాత్రి ప్రారంభమైంది. శనివారం గొల్లబజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యాదవుల కుల దేవాలయం నుంచి మకర తోరణాన్ని దురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గుట్టకు తరలించగా, ఆదివారం అర్థరాత్రి కేసారం నుంచి దేవరపెట్టెను, ఖాసీంపేట నుంచి పసిడి కుండను పెద్దగట్టుపైకి చేర్చడంతో జాతర అధికారికంగా ప్రారంభమైంది. మెంతబోయిన, గొర్ల, మున్నా వంశస్తులు దేవరపెట్టెతో కాలినడకన దురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.