బీఆర్ఎస్ పార్టీకి షాక్..సూర్యాపేట, వికారాబాద్లో కీలక నేతలు రాజీనామా

ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్కు షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీలో కీలక నేతలంగా వీడ్కోలు పలుకుతున్నారు. తాజాగా సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లోని బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను అధినేత కేసీఆర్కు పంపారు. 

సూర్యాపేట పట్టణ 13 వార్డ్  కాన్సిలర్ వట్టే రేణుక బిఆర్ఎస్కు  రాజీనామా చేశారు.  ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్  వట్టే జానయ్య మీద పెట్టిన అక్రమ కేసులు, ఆయన  కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. వట్టే రేణుకతో పాటు వందమంది బీఆర్ఎస్  కార్యకర్తలు, నాయకులు కూడా కారు దిగారు. 

అటు  వికారాబాద్ జిల్లాలో  బీఆరెస్స్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు దోమ మండల ఎంపీపీ అనసూయ రాజీనామా చేశారు. వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లతో కలిసి ఆమె కాంగ్రెస్ లో చేరారు. దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకనే తాము బీఆర్ఎస్ వీడుతున్నామని తెలిపారు.