సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్​ నాయకుడి హత్య

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్​ నాయకుడి హత్య

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్​ నాయకునిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి  చేసి హత్య చేశారు,  మిర్యాల గ్రామానికి చెందిన మెంచు చక్రయ్యపై కొంతమంది దుండగులు దాడి చేశారు.  చక్రయ్య పొలం పనులు ముగించుకొని వస్తుండగా  ముత్యాలమ్మ గుడి దగ్గరకు రాగానే ఒక్కసారిగా దాడి జరిగింది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చక్రయ్యను సూర్యాపేట హాస్పిటల్ తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చక్రయ్య మృతి చెందాడు.   పాత కక్షలు కారణమై ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుంగా మిర్యాల గ్రామంలో పికెటింగ్​ తో పాలు 144 సెక్షన్​ విధించారు.